Spread the love

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 52 వినతులు.

కమిషనర్ ఎన్.మౌర్య

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 52 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 6 మంది తమ సమస్యలు తెలుపగా, 46 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి. మునికృష్ణ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రకాశం పార్కును ఉదయం 4.30 గంటలకు తెరవాలని, అన్నారావు కూడలి వద్ద బోర్ మోటార్ మరమ్మత్తులు చేయించాలని, మధురానగర్ లోని తెలుగుగంగ కార్యాలయం వద్ద చెత్త వేస్తున్నారు,

నిరోధించాలని, నగరంలోని పలు ప్రాంతాల్లో చికెన్ పకోడా రోడ్డుపైన ఓపెన్ గా కాల్చుతుండడంతో ఇబ్బందిగా ఉందని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని, రాదేశ్యాం అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సౌండ్ ఎక్కువగా ఉందని, గోవిందయ నగర్ వద్ద కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ప్రకాశం పార్కుల్లో డి.జె. సౌండ్ ఎక్కువగా ఉంది తగ్గించాలని, వాకర్స్ కి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ పక్కన కాలువలో పేరుకుపోయిన చెత్త తొలగించాలని, నగరంలో నీటి వ్యాపారం కోరందుకోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి అరికట్టాలని ప్రజలు కోరారని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, డి.ఈ.లు, ఏసిపి లు, తదితరులు ఉన్నారు.