
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 59 వినతులు.
కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 59 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 8 మంది తమ సమస్యలు తెలుపగా, 51 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ , కార్పొరేటర్ రాధాకృష్ణ పాల్గొని పెండింగ్ లో ఉన్న టి.డి.ఆర్. బాండ్లు వెంటనే మంజూరు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టిటిడి పరిపాలనా భవనం పక్కన వేసిన రోడ్డున పూర్తిగా వేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కొరకు డబ్బులు కట్టామనీ a డబ్బులు ఇప్పించాలని, పద్మావతి నగర్ లో నీటి వసతి కల్పించాలని, తమ స్థలంలో నిర్మించుకున్న ప్రహరిని ఎటువంటి నోటీసులు లేకుండా తొలగించారని, తన భర్త మునిసిపల్ వాహనం ప్రమాదంలో మరణించారని తనకు న్యాయం చేయాలని, వినాయక స్వామి గుడి నిర్మాణం చేస్తుంటే ఆటంకం కల్పిస్తున్నారని, కొత్తపల్లి నలంద స్కూల్ ప్రాంగణాన్ని నలంద నగర్ గా పేరు మార్చాలని, నగరంలో నీటి వ్యాపారం ఎక్కువ కావడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, డి.ఈ.లు, ఏసిపి లు, తదితరులు ఉన్నారు.
