
7 సింగిల్ విండోల కమిటీలు ప్రకటన
** ఉత్తర్వులు అందించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి: చంద్రగిరి చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని యర్రావారిపాలెం, రామచంద్రాపురం, మల్లంగుంట, చిన్నగొట్టిగల్లు, పాకాల , ఐతేపల్లి, నరసింగాపురం సింగిల్ విండోల చైర్మన్లు, కమిటీ సభ్యులను ఎమ్మెల్యే పులివర్తి నాని బుధవారం ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అందాయి. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి నియోజకవర్గంలో 7 ప్రాథమిక సహకార సంఘాలకు (సింగిల్ విండోల) చైర్మన్లు, కమిటీ సభ్యులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని యర్రావారిపాలెం, రామచంద్రాపురం, మల్లంగుంట, చిన్నగొట్టిగల్లు సింగిల్ విండోలకు ప్రస్తుతం అఫిషియల్ సభ్యులుగా ఇంచార్జి కమిటీలు వున్నాయి. వాటి స్థానంలో ప్రభుత్వం తాజాగా నాన్ అఫిషియల్ సభ్యుడుగా ఇంఛార్జి కమిటీలను నియమించింది. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని యర్రావారిపాలెం, రామచంద్రాపురం ,మల్లంగుంట,చిన్నగొట్టిగల్లు, పాకాల , ఐతేపల్లి, నరసింగాపురం సింగిల్ విండో చైర్మన్లుగా ఎస్.రఘు, సి.జనార్దన చౌదరి, సి.మధుశేఖర్, ఎం.ప్రభాకర్, పల్లినేని సుబ్రమణ్యం నాయుడు, రాజులగారి వినోద్ కుమార్ రెడ్డి, సావిత్రిలు నియామకం అయ్యారు. కమిటీ సభ్యులుగా పల్లెపాకు నాగరాజు, డి.దేవేంద్ర నాయుడు, ఏ.చిరంజీవి, ఎం.చిరంజీవి, వి.చిరంజీవి, పి.మోహన్ రెడ్డి, జి.శోభారాణి, పి.అలివేలమ్మ, భాస్కర్ బాబు, వెంకటముని, ఉమామహేశ్వర రావు, రెడప్ప శెట్టి, ఆనంద్, కిరణ్ కుమార్ లను కమిటీ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగిందని ఎమ్మెల్యే పులివర్తి నాని వెల్లడించారు.
