
“పితృదేవతల పిండ ప్రదానం షెడ్ల”ను ఏర్పాటు చేయండి
** టీటీడీ ఈఓకు “రెడ్డీస్ భారత్ అసోసియేషన్” వినతి పత్రం
తిరుపతి: హిందూ సనాతన ధర్మంలో పితృదేవతలకు అమావాస్య, సంక్రాంతి,
కాల అమావాస్యను పురస్కరించుకొని నగర ప్రజలు పిండ ప్రదాన సమర్పణ బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య పర్వదినాలలో జరిపించడం హిందువుల సంప్రదాయమని, అత్యంత పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని కపిలతీర్థం వద్ద నిర్వహించుకునేందుకు ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై మంగళవారం టీటీడీ ఈఓ శ్యామలరావుకు “రెడ్డీస్ భారత్ అసోసియేషన్” తరపున వినతి పత్రం ఇచ్చారు.
ఇప్పుడు ప్రత్యేక షెడ్లు లేనికారణంగా రోడ్లపై కూర్చొని కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ నగర ప్రజలు పితృ దేవతలకు పిండ ప్రధాణం జరిపించుకోవడం బాధాకరమని నవీన్ అన్నారు. కపిలతీర్థం వద్ద పర్వదినాలలో పిండ ప్రధానం కోసం శాశ్వత షెడ్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని రెడ్డీస్ భారత్ కమిటీ విజ్ఞప్తి చేశారు. కపిలతీర్థం వద్ద పితృదేవతలకు సమర్పించే పిండ ప్రదాన కార్యక్రమానికి శాశ్వత షెడ్లు నిర్మించి మంచినీటి సౌకర్యం కల్పించాలని, అలాగే రామచంద్ర పుష్కరిణి, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాలలో సైతం కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కపిలతీర్థం వద్ద పితృదేవతలకు రోడ్లపై కూర్చొని పిండ ప్రధాన కార్యక్రమం నిర్వహించడం బాధాకరమని తిరుమల కొండకు వెళ్లే వాహనదారులకు సైతం అసౌకర్యం కలుగుతుందని,
ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గతంలో లాగా కపిలతీర్థంలోని ఆంజనేయస్వామి ఆలయం ముందు భాగంలో, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో పర్మినెంట్ షెడ్లను, స్నానపు గదులను ఏర్పాటు చేయాలని ఈవోకి విజ్ఞప్తి చేయగా…. సానుకూలంగా స్పందించి సహృదయంతో సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పడం శుభపరిణామం అని నవీన్ తెలిపారు. టిటిడి ఈవోని కలిసిన వారిలో నవీన్ కుమార్ రెడ్డి, దుగాండ్ల పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మునీశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, మబ్బు శ్రీమన్నారాయణ రెడ్డి, సిద్ధారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మహేష్ తదితరులు ఉన్నారు.
