అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన జై భీమ్ భారత్ పార్టీ
కృష్ణానది కలుషితంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫిర్యాదు
విజయవాడ మున్సిపల్ కమిషనర్ కు పరసా సురేష్ ఫిర్యాదు
జైభీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్,మరియు అధికార ప్రతినిధి వై కొండలరావు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ని కలిసి
*E-3 హోటళ్ల కార్యకలాపాల నిమిత్తం జేఏఎన్ సంస్థకు లీజును కొనసాగించవద్దని, ప్రస్తుత లీజును కూడా రద్దు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ధన దాహంతో కృష్ణా నదిని కబళిస్తు,పద్మావతి ఘాట్ లో వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నారని,
నదిలో వంద మీటర్ల లోపే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని,
నదిలోపలికి వ్యర్ధ పదార్ధాలు వదులుతూ పూర్తి కాలుష్యం చేస్తున్నారని,
ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు పూర్తి విరుద్ధం అని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రకు వివరించారు.
కార్పొరేషన్ లీజు ద్వారా రూ 70 కోట్ల దోపిడీ జరుగుతుందని,
పోరాటానికి సిద్ధమైన జైభీమ్ రావ్ భారత్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన మీడియాకి తెలిపారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లొ కేసు వేశామని.
కృష్ణా నదీ పరివాహక ప్రాంతాన్ని పాలకులే చెరబడుతున్నారు. కంచె చేను మేసినట్లు పరమ పవిత్రమైన పద్మావతి నది ఘాట్ ను కమర్షియల్ కార్యకలాపాలకు వేదిక గా మార్చారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు,విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారుల అండతో ప్రకాశం బ్యారేజ్ కి తూర్పు అభిముఖంగా ఉండే పద్మావతి ఘాట్ ను కొందరు యదేచ్చగా వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. పుష్కరాల సమయంలోనూ, ప్రతి ఏటా భవానీ మాలల సమయంలోనూ పవిత్ర స్నానాలను ఆచరించే పద్మావతి ఘాట్ ను హోటల్ వ్యాపార కార్యకలాపాలతోను, హోటల్ వ్యర్ధాలను కృష్ణా నదిలోకి వదులుతూ నదిని అపవిత్రం చేస్తున్నారు. ఏడు సంవత్సరాల నుంచి యదేచ్చగా సాగుతున్న ఈ కార్యకలాపాలను కూటమి ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు ప్రయత్నం చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్,సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా
కృష్ణానది పద్మావతి ఘాట్ కట్టడాలు :
విజయవాడ నడిబొడ్డున పండిట్ జవహర్ లాల్ బస్ స్టేషన్ కు ఎదురుగా కృష్ణా నదీ ఒడ్డున వివిధ రకాల హోటళ్లు , కన్వెన్షన్ సెంటర్, ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాల పేరుతో పూర్తిగా కమర్షియల్ యాక్టీవిటీ నడుస్తోంది. ఇది పూర్తిగా పద్మావతి ఘాట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. హోటళ్లలో వ్యర్ధాలన్నింటిని కృష్ణా నదీ లో వదులుతున్న పరిస్థితి దీంతో నదిలో నీళ్లు కూడా కలుషితం అవుతున్నాయి. ఒకటీ అర హోటళ్లు కాదు… చిన్న పెద్దవి కలిపి వంద వరకు ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్రప్రభుత్వం, మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా ఒక కాంట్రాక్టర్ లీజుకు తీసుకుని ఇతర వ్యాపారులకు అద్దెలకు ఇచ్చి ఉన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతమైన పద్మావతి ఘాట్ లో పర్మినెంట్ కట్టడాలు చేపట్టారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు ఈ కట్టడాల నిర్మాణం పూర్తి విరుద్ధంగా ఉంది.
ఎవరీ కాంట్రాక్టర్….. ఏమా కథ:
తెలంగాణాలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడు ఏపీ లో ఉన్న రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకొని చక్రం తిప్పారు. 2018 అక్టోబర్ 25 వ తేదిన విజయవాడ కార్పొరేషన్ లో తెలంగాణ కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నారు. జేఏఎన్ ఎంటర్ టైన్మెంట్ ప్రై లిమిటెడ్ పేరుతో ఈ ఒప్పందం చేసుకున్నారు. అందుకు గాను మునిసిపల్ కార్పొరేషన్ కు సంవత్సరానికి రూ 25 లక్షలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు.
పది షాపుల్లో మాత్రమే అద్దెకు ఇవ్వాలి కానీ, చిన్నవి పెద్దవి కలిపి వంద షాపులకు అద్దెకు ఇచ్చారు ఆ కాంట్రాక్టర్ ఒక్కో హోటల్, షాపు నిమిత్తం సగటున నెలకు రూ 50 వేలు వసూలు చేస్తున్నారు. అంటే వంద షాపులకు నెలకు రూ 50 లక్షలు… సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. లీజు పేరుతో విజయవాడ కార్పొరేషన్ కు ఆ కాంట్రాక్టర్ చెల్లిస్తోంది మాత్రం సంవత్సరానికి రూ .25 లక్షలు. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు దోపిడీ ఏ స్థాయిలో ఉంది అనది. కాంట్రాక్టర్ అక్రమంగా సంపాదించిన సొమ్మునుంచి ప్రభుత్వంలోని పెద్దలు, మునిసిపల్ అధికారులకు కొద్దోగొప్పో ముట్ట చెప్పడంతో ఎవరూ నోరు మెదపలేదు.
ఏడేళ్లలో రూ 70 కోట్లు:
2018 అక్టోబర్ 5 వ తేదిన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో ఈ కాంట్రాక్టర్ ఐదేళ్లపాటు ఒప్పందం చేసుకున్నాడు.
ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించుకున్నాడు 2018 తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన ఈ దోపిడీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగింది.
వైసీపీ కి చెందిన ఒక మంత్రికి కాంట్రాక్టర్ ముడుపులు ముట్ట చెప్పడంతో అదే కాంట్రాక్టును కొనసాగించారు. అద్దెల ద్వారా ఏడాదికి ఆరు కోట్లు చొప్పున ఏడేళ్లలో రూ 42 కోట్లు దండుకున్నారు. ఒక లీజును అడ్డం పెట్టుకుని బస్ స్టేషన్ పక్కన ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ లో ఇదే కాంట్రాక్టర్ తిష్ట వేసాడు మునిసిపల్ అధికారుల సహకారంతో రాజీవ్ గాంధీ పార్కులోన ఎంటర్టైన్మెంట్, పిల్లల ఆటలకు సంబంధించిన కార్యకలాపాలను మరియు బైట పార్కింగ్ ఇదే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నాడు. ఈ పార్కులో నిర్వహిస్తున్న కార్యకలాపాల ద్వారా ఏడాదికి సుమారుగా మరో నాలుగు కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు అంచనాగా ఉంది. ఏడేళ్లనుంచ ఏడాదికి నాలుగు కోట్ల రూపాయల చొప్పున రూ 28 కోట్లు వెనకేసుకున్నారు. మొత్తంగా రెండుచోట్ల కలిపి ఏడేళ్లలో రూ 70 కోట్లు దండుకున్నారు.
అసలు కార్పొరేషన్ ఎలా లీజు ఇచ్చింది..?
E-3 పేరుతో జేఏఏఎన్ ఎంటర్ టైన్మెంట్ నిర్వహిస్తున్న వ్యాపార, హోటల్ కార్యకలాపాలన్నీ పద్మావతి ఘాట్ లో నడుస్తున్నాయి. పద్మావతి ఘాట్ లో ఈ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, JAAN అనే సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. పద్మావతి ఘాట్ పూర్తిగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. రాష్ట్ర నీటి పారుదల శాఖ పరిధిలోనికి వస్తుంది. దీన్ని లీజుకు ఇచ్చే అధికారం కార్పొరేషన్ కు ఎక్కడుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం వంద మీటర్ల కన్నా తక్కువ లో నదీ ప్రవాహం ఉన్నచోట వ్యాపార కార్యకలాపాలకు ఎలా అనుమతిచ్చారు? ఈ హోటళ్లలో వ్యర్ధాలన్నింటిని కృష్ణా నదీ లోకి వదలడం వల్ల స్వచ్ఛమైన నదీ కలుషితం అవుతుంది కదా? నదీ పరివాహక ప్రాంతాన్ని పబ్లిక్ ప్లేస్ కింద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టంగా తన నిబంధనల్లో పేర్కొన్నది. అలాంటి పబ్లిక్ ప్లేస్ ను ఎలా వ్యాపార కార్యకలాపాలకు ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కార్పొరేషన్ ఇవ్వాలి. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను తుంగలో తొక్కి మునిసిపల్ శాఖ డబ్బులు దండుకుంటున్న వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది.
నదీ లోనూ కార్యకలాపాలు
హోటళ్ల పేరుతో పద్మావతి ఘాట్ లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా నదిలోకి కూడా యదేశ్చగా దిగుతున్నారు. పద్మావతి ఘాట్ లో ఏర్పాటు చేసిన ఈ హోటళ్ల నుంచి మెట్ల మీదుగా నదీ లోకి దిగకుండా ఎలాంటి బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రి సమయాలలో సైతం కొందరు హోటళ్లకు వచ్చిన వారు నదిలోకి దిగుతున్న పరిస్థితి ఉంది. నదిలోపలికి, ఇసుక తిన్నెల మీదికి దిగే వారికి ఇబ్బంది లేకుండా లైట్లు కూడా ఏర్పాటు చేశారు. కొందరు యువతీ, యువకులు రాత్రి సమయాలలో ఇసుక తిన్నెల వైపునకు వెళ్లడం ప్రమాదకరంగా కూడా మారుతోంది. మహిళలు, యువతుల భద్రతకు ముప్పు వాటిల్లితే ఎవరూ బాధ్యత వహిస్తారు?
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు :
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడంపై జైబీమ్ రావు భారత్ పార్టీ న్యాయపోరాటానికి దిగుతుంది. సమాచార హక్కు చట్టం ద్వారా కొంత సమాచారం సేకరించామని, పద్మావతి ఘాట్ లో కమర్షియల్ యాక్టివిటీస్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని ఆ పార్టీ నాయకులు చెప్పుతున్నారు. పూర్తి ఆధారాలతో చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ లో ఫిర్యాదు చేయబోతున్నామని జేబీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ మీడియా కు వెల్లడించారు. E-3 హోటళ్ల కార్యకలాపాల నిమిత్తం JAAN సంస్థకు లీజును కొనసాగించవద్దని, ప్రస్తుత లీజును కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ మునిసిపల్ కమీషనర్ కు విజ్ఞాపన పత్రం అందించామని తెలిపారు పద్మావతి ఘాట్ లో కమర్షియల్ యాక్టీవిటీకి లీజును కొనసాగిస్తే ప్రజాందోళనలకు దిగుతామని హెచ్చరించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఇతర చోట్ల కూడా అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా కూడా తమ పార్టీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమౌతుందని ఈ సందర్భంగా పరసా సురేష్ తెలిపారు.