Spread the love

124 ఆల్విన్ కాలనీ డివిజన్ శంషిగుడా పరిధిలోని ఇంద్రహిల్స్ లో జరిగిన కాలనీ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా గెలుపొందిన వెంకట్ నాయక్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అధ్యక్షునుకి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ కమిటీ ని ఏర్పాటుచేసుకుని కార్యవర్గ సభ్యులందరు సమిష్టిగా కలిసి పనిచేస్తూ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, మహిపాల్ గౌడ్, జి.రామారావు, నరసింహులు, కాంతారావు, బి.చందు, సతీష్, రంజిత్, రమేష్, శ్రీను, ఉరుకుందు, చిన్న రాజు తదితరులు పాల్గొన్నారు.