
ఏపీ ఎప్ సెట్ నోటిఫికేషన్ విడుదల!
హైదరాబాద్:
విద్యార్థులు ఎదురు చూస్తున్న ఏపీ ఎప్‌సెట్ (EAPCET)కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. నోటిఫికేషన్ విడుదల కానుంది.
దీనికి సంబంధించి పూర్తి సమాచారం మధ్యాహ్నం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుం దని కన్వీనర్ ఆచార్య బి. దిలీప్ కుమార్,కో కన్వీనర్ కె. విజయ కుమార్ రెడ్డి, పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులను ఈ నెల 25 నుంచి స్వీకరించనున్నారు.

నాన్ లోకల్ కోటా ఎత్తివేస్తారా?
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) కన్వీనర్ కోటాకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. బీటెక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటివరకు ఉన్న 15 శాతం అన్‌రిజర్వుడ్ (నాన్ లోకల్) కోటా ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇంజినీరింగ్ సీట్లను 70 శాతం కన్వీనర్ కోటా అందించగా, 30 శాతంతో బి.కేటగిరీ(మేనేజ్‌మెంట్) కింద భర్తీ చేయడం జరుగుతుంది.
అయితే, కన్వీనర్ కోటా లోని సీట్లలో 85 శాతం వరకు తెలంగాణ స్థానికత విద్యార్థులకే కేటాయిస్తు న్నారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణ సహా ఏపీ విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లు అవుతుంది. స్థానికత, స్థానికేతర కోటా అంశాలకు సంబంధించి అధ్యయనంపై ప్రభుత్వం 2024 డిసెంబరులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఇప్పుడు ఆ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేసింది.
కన్వీనర్ కోటా సీట్లపై ఉత్కంఠ!
కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలని, 95 శాతం రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5 శాతం ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలంగాణ స్థానికత విద్యార్థులకు ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.