TEJA NEWS

సర్కారీ పాఠశాలలకు పూర్వవైభవం

** పేరెంట్స్ మీట్ లో చిత్తూరు ఎంపీ, పూతలపట్టు ఎమ్మెల్యే

చిత్తూరు: కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలో సర్కారీ బడులకు పూర్వ ఉన్నత వైభవం వస్తోందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ అన్నారు. ప్రభుత్వ బడులతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అని వారు పేర్కొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాళ్యం మండలం, కీరమంద, బంగారుపాళెం గ్రామాల్లోని జెడ్.పి.హై స్కూళ్ళలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుతో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అంతకు ముందు ప్రభుత్వ పాఠశాలలకు విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలకు బంగారు పాళెం మండలాధ్యక్షుడు ధరణి, సీనియర్ టీడీపీ నేతలు జయ ప్రకాష్ నాయుడు, టిడిపి చిత్తూరు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జెడ్.పి.హై స్కూళ్లకు చెందిన ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు. పాఠశాలల ప్రాంగణంలో ఎంపీ, ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన, సరస్వతి దేవికి పూజాధి కార్యక్రమాలను నిర్వహించి, మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ… దేశానికి పట్టుకొమ్మలు ప్రభుత్వ బడులేనన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యనభ్యసించిన
ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని గుర్తు చేశారు. అయితే ఆధునిక పోకూడలతో సర్కారీ బడుల మనుగుడ ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో.., వాటి పరిరక్షణకు కావలసిన చర్యలను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందని తెలియజేశారు. అధ్యాపకులు కూడా తల్లిదండ్రుల సమన్వయంతో ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం తీసుకురావాలని సూచించారు. తామంతా గవర్నమెంట్ పాఠశాలలలోనే విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకున్నామని గుర్తుచేసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు… ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడంలో తాము ఎప్పుడు ముందుంటామని తెలిపారు.