TEJA NEWS

నల్లబండగూడెం శ్రీ సాయి మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు…


కోదాడ సూర్యాపేట జిల్లా:
కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం షిరిడి సాయి నగర్ లో గల శ్రీ సాయి మందిరంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు , టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి, కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,మాజీ తాజా ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు సుమారు పదివేల మంది భక్తులకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నరసింహారావు గ్రామ పెద్దలు అలసకాని శరభయ్య, ముండ్రా రంగారావు, ఏ శ్రీనివాసరావు, ముండ్రా శివరామకృష్ణ ,ఎం రామకృష్ణ ,ఆదినారాయణ ,ఎన్ వెంకటేశ్వర్లు ఎం నర్సింగరావు, బొల్లు రాంబాబు ,ముండ్రా రమేష్ పూర్ణయ్య ,సుందర్రావు ,భాస్కర్ రావు , విశ్వేశ్వరరావు, సుధాకర్ రామారావు, వేలాదిమంది మహిళా సాయి భక్తులు వివిధ గ్రామాల నుండి వచ్చి సాయి నీ భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు.