TEJA NEWS

లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సోదరులకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసిన సందర్భంగా రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , బడంగ్పేట్ మాజీ మేయర్ పారిజాత నరసింహ రెడ్డి ,మాజీ శాసన సభ్యులు సుధీర్ రెడ్డి ,కూన శ్రీశైలం గౌడ్ ,మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి వజ్రేష్ యాదవ్ , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ,ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుర్గం భాస్కర్ , ఎపి మిథున్ రెడ్డి , పీసరి మహేందర్ రెడ్డి ,అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం గారు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,మార్కెట్ యార్డ్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు మరియు జిల్లా ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.