TEJA NEWS

మానవత్వం చాటుకున్న టీడీపీ నాయకులు: జంగా వినాయకుడు, ఉప్పలపాటి సురేష్

చిలకలూరిపేట పట్టణం, పోలిరెడ్డిపాలెం సమీపంలో రోడ్డుపై పడిపోయిన ఓ వ్యక్తికి సకాలంలో సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు టీడీపీ నాయకులు జంగా వినాయకుడు, ఉప్పలపాటి సురేష్.వివరాల్లోకి వెళ్తే, చిలకలూరిపేట నుండి గంగన్నపాలెం వెళ్తున్న గంగన్నపాలెం వాసి ఒకరు రోడ్డుపై పడిపోయి ఉన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల లేదా కళ్లు తిరిగి పడిపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తలకు గాయమై, రక్తం కారుతుండటాన్ని గమనించిన స్థానికులు అక్కడే ఉన్న టీడీపీ నాయకులు జంగా వినాయకుడు, ఉప్పలపాటి సురేష్ దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన ఈ ఇద్దరు నాయకులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోపు క్షతగాత్రుడి వివరాలు సేకరించి, అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం, 108 సిబ్బంది సహాయంతో ఆ వ్యక్తిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆ వ్యక్తికి ప్రాణాపాయం లేదని, ఎటువంటి ఇబ్బంది లేదని తెలిసింది. సకాలంలో స్పందించి సహాయం అందించిన టీడీపీ నాయకులు జంగా వినాయకుడు, ఉప్పలపాటి సురేష్‌పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.