TEJA NEWS

బాపట్ల జిల్లా నుండి బదిలీ పై వెళుతున్న ఆర్మడ్ రిజర్వ్ అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్

శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా ఆర్మడ్ రిజర్వ్ అధికారులు కీలకపాత్ర పోషించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఇటీవల జరిగిన బదిలీలలో బాపట్ల జిల్లాలో విధులు నిర్వహించే ఏ.ఆర్ డి.ఎస్.పి ఎమ్.డి.హెచ్ ప్రేమ్ కుమార్, ఆర్.ఐ లు ఎల్. మన్మధ రావు, బి.శ్రీకాంత్ నాయక్, ఎల్.గోపీనాథ్, ఆర్.ఎస్.ఐ లు సీ.జే భరత్, ఎన్. గోపి లు వివిద జిల్లాలకు బదిలీపై వెళుతున్నందున గురువారం నాడు జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది వీడ్కోలు అభినందన సభ నిర్వహించారు. ఈ వీడ్కోలు అభినందన సభలో బాపట్ల డిఎస్పీ టి.వెంకటేశులు, ఎస్.బి ఇన్స్పెక్టర్ వి.మల్లికార్జున, డిటిఆర్బీ ఇన్స్పెక్టర్ సిహెచ్ సింగయ్య, జిల్లా ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


TEJA NEWS