Spread the love

మీ రాక మాకెంతో సంతోషం : శ్రీశ్రీశ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం…

బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ నీ ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేసిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్ లోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమ కరపత్రికను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో భౌరంపేట్ పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, దేవాలయ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు శంకరప్ప, కోశాధికారి వి. ప్రశాంత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు రామచంద్ర రెడ్డి, పాండురంగం గుప్త, నామాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.