
పోలీసుల కూంబింగ్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
పోలీసుల కూంబింగ్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
ఛత్తీశ్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల డంప్ బయటపడింది. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రాజ్గూడెం గ్రామ సమీపంలోని చింతవాగు నది వద్ద భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భారీగా ఆయుధాలు లభించినట్లు భద్రత బలగాలు తెలిపాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ఇటీవల భద్రత బలగాలు ఛత్తీశ్‌గఢ్ అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి.
