Spread the love

ఏపీలో ఆదర్శ పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ 25 నుంచి

అమరావతి : ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరేందుకు ప్రవేశాలకు ఈనెల 25నుంచి మార్చి 31వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఓసీ, బీసీలు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20వ తేదీన
నిర్వహించనున్నారు.