
ప్రతి ఎన్నిక ఒక యుద్ధమే..!
విజయ తీరాన్ని చేరే వరకు విశ్రమించవద్దు.
ఆలపాటి రాజా గెలుపుకు శ్రమించండి.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు .
ఇబ్రహీంపట్నంల్ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం.
ఎన్టీఆర్ జిల్లా,
ప్రతి ఎన్నిక ఒక యుద్ధమే..! విజయ తీరాన్ని చేరే వరకు విశ్రమించవద్దు. ప్రత్యర్థి ఎవరైనా చివరి నిముషం వరకు మనం శ్రమించాల్సి ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపుకు అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పిలుపునిచ్చారు.
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని ఎం.వి.ఆర్ కళ్యాణమండపంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత అన్న ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజా , ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్, ఎన్నికల పరిశీలకురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి , శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు గారు, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు , జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జి అమ్మిశెట్టి వాసు , జనసేన మైలవరం నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇంఛార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల) , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా) , ఆలపాటి రాజా సమన్వయకర్త తుమ్మల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో పట్టభద్రులంతా అలపాటి రాజా కి తొలి ప్రాధాన్యత ఓటును ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్నుతో 1 అంకెపై వేయాలని అన్నారు.
మైలవరం నియోజకవర్గంలో 13,510 ఓట్లు నమోదు చేసుకున్నారన్నారు. తప్పనిసరిగా ఎక్కువశాతం ఓట్లు పోలయ్యే విధంగా కూటమి కార్యకర్తలు, నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.
స్వగ్రామాలకు దూరంగా నగరాలలో ఉంటున్న వారిని కూడా రప్పించి ఓట్లు వేయించాలన్నారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ (పి.ఓ.సి)లు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా వ్యవహరించాలన్నారు. మనం గెలుస్తామనే ధీమా లేకుండా కష్టపడి పని చేయాలన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితం వస్తుందన్నారు. ఆలపాటి రాజా విజయం తథ్యమన్నారు.
ప్రధాని మోడీ , సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతుందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆలపాటి రాజా ని గెలిపించాలన్నారు.
గుంటల మయంతో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగుచేశామన్నారు. ఒకనాడు 10వ తేదీ దాటినా జీతాలు వస్తాయో రావో ఉన్న అయోమయ పరిస్థితి నుంచి, నేడు 1వ తేదీనే జీతాలు ఇచ్చే స్థితికి తెచ్చామన్నారు. దార్శనికులు సీఎం చంద్రబాబు ఏపీని ఆర్థికంగా పటిష్ట పరిచేందుకు కృషి చేస్తున్నారన్నారు. సంపదను సృష్టిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చర్యలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
