
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర విజన్ లో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరియు సిడిఎంఎ సూచనల మేరకు
వినుకొండ పురపాలక సంఘం* మార్చి మూడవ (మార్చి 14)లోపు థీమ్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం మరియు 120 మైక్రానుల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధం గురించి

వినుకొండ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు శానిటరీ సెక్రెటరీలు, మేస్త్రిలు పారిశుధ్య సిబ్బంది పట్టణంలోని ప్లాస్టిక్ హోల్సేల్ షాపుల వద్ద తనిఖీలు చేపట్టారు.ఇందులో భాగంగా పట్టణ ప్రజలు సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకుండా మరియు 120 మైక్రానుల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధించడమైనది కావున జ్యూట్ బ్యాగులు క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైనది,హోల్ సేల్ ప్లాస్టిక్ వ్యాపారస్తులకు ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్స్ మరియు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ జ్యూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ వంటివి సమకూర్చుకోవాల్సిందిగా సూచించడమైనది.తినే ఆహార పదార్థాలను ప్లాస్టిక్ వస్తువులలో ప్యాక్ చేయడం వలన హానికారక క్యాన్సర్ కారకాలు ఆహార పదార్థాలలో చేరి తీవ్ర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ మరియు 120 మైక్రాల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ ను వాడకుండా పురపాలక సిబ్బందికి సహకరించవలసినదిగా కోరడమైనది.