Spread the love

మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలి

బొప్పూడి ప్రభను ప్రారంభించిన బాలాజీ

ప్ర‌జ‌ల‌కు, జ‌న‌సైనికుల‌కు మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు

జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌ :
శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి అన్నారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభ కోటప్పకొండ తరలి వెళ్ళటానికి బాలాజీ కొబ్బరికాయ కొట్టి లాంచనంగా ప్రారంభించారు..

ఈ సందర్భంగా బాలాజి ప్ర‌జ‌ల‌కు, జనసైనికులకు, వారి కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.