TEJA NEWS

వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

హర్షం వ్యక్తం చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యే లకు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ

వరంగల్ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెర వేరనుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఎంపీ డా..కడియం కావ్య హర్షం వ్యక్తం చేసారు. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం కొరకు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలసి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖలు అందజేసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని వెల్లడించారు. గత పదేండ్లుగా పెండింగ్‌ లో ఉన్న ఎన్‌వోసీ అడ్డంకిని రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ యాజమాన్యం తో సంప్రదింపులు జరిపి, బోర్డులో పెట్టి ఎన్‌వోసీ ఇచ్చేలా చేసిందన్నారు.

దీంతో హెచ్ఏఐఎల్ తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలో మీటర్ల నిబంధనను సవరిస్తూ ఎన్‌వోసీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఇప్పటికే మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణకు తెలంగాణ సర్కార్205 కోట్లు విడుదల చేసిందని తెలియజేశారు. భూ సేకరణ పనులు పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే విమానాల రాక పోకలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, జిల్లా మంత్రులకు ఎంపీ కృతజ్ఞతలు తెలియజేసారు.