TEJA NEWS

అందరికీ అభిమానిగా అందరిలో ఒకడిగా ఉండే సమాద్ ఖాన్ పఠాన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి

చిలకలూరిపేట

చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల కోసం పుట్టిన నాయకుడు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి సమక్షంలో ఘనంగా జరిగిన చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు సమాద్ ఖాన్ పఠాన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి

ప్రత్తిపాటి మాట్లాడుతూ పార్టీలో ఏ పని చెప్పినా ఎంత కష్టమైనా పనైనా సరే తన శక్తికి మించిన పనైనా సరే చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి చూపిస్తాడు…

అందరికీ అభిమానిగా అందరిలో ఒకడిగా పార్టీకి అహర్నిశలు కృషి చేసే వారిలో ముందు వరసలో ఉంటాడు ప్రత్యర్థులను తన మాటల యుద్ధంతో ఓడించగలుగుతాడు ఏ కష్టం వచ్చినా పార్టీకి కృషి చేస్తూ అందరికి ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తేవడంలో కీలక పాత్ర పోషిస్తాడు కష్టపడే యువ నాయకుడు సమాద్ ఖాన్ ను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను
అంటూ మాట్లాడారు….

యువ నాయకుడు, చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయిన సమద్ ఖాన్ పఠాన్ 44వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో….

పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి మరియు ఐటీడీపి నుండి మరియు 19వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ రేషన్ డీలర్ల అసోసియేషన్ నుండి తీసుకువచ్చిన పుట్టినరోజు కేకులను ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో కట్ చేసి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మహిళా మణులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు…

. ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టణ అధ్యక్షుడు సమద్ ఖాన్ పఠాన్ పేరు మీద కాయలు, పండ్లు, స్వీట్స్ పంచి పెట్టారు. వారు మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించి తెలుగుదేశం పార్టీకి విశేష సేవలు అందించాలని కోరుకుంటూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు…..