TEJA NEWS

కార్మిక హక్కుల పరిరక్షణే తన ధ్యేయం: ఆంధ్ర పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారి సమక్షంలో ఆంధ్ర పాలిమర్స్ నందు కుదిరిన నూతన వేతన ఒప్పందం….

130 – సుభాష్ నగర్ డివిజన్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఆంధ్ర పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నందు కంపెనీ యాజమాన్యానికి, కార్మికులకు మధ్య జరిగిన సమావేశానికి యూనియన్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హాజరై పర్మినెంట్ కార్మికుల న్యాయబద్ద డిమాండ్ అయిన వేతన సవరణను చర్చించగా కార్మికుల వేతనాన్ని 5800 రూపాయల నుంచి 7600 రూపాయలకు పెంచుతూ కంపెనీ యాజమాన్యంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. కార్మికుల సంక్షేమమే తన ధ్యేయమని, కార్మికుల హక్కుల పరిరక్షణలో నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. నూతన వేతన సవరణ ఫిబ్రవరి నెల నుంచి అమల్లోకి వచ్చిందని తెలియజేశారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన కంపెనీ యాజమాన్యానికి నా అభినందనలతో పాటు కార్మికులకు నా శుభాకాంక్షలు.

ఈ కార్యక్రమంలో కంపెనీ హెచ్ఆర్ ఎం. సురేష్ బాబు, ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి. రసూల్, ఉపాధ్యక్షులు బిఎంసి రమేష్, సంయుక్త కార్యదర్శి టి. రవి కిరణ్, ఆర్గనైజర్ డి. జోగారావు, కోశాధికారి ఎన్. శ్రీను తదితరులు పాల్గొన్నారు.