
ప్రభుత్వం విడుదల చేసిన జి వో ల పై టౌన్ ప్లానింగ్ & ఇంజనీర్స్ , సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం..
చిలకలూరిపేట : ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర మునిసిపల్ శాఖ
మాత్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశముల
మేరకు నూతనంగా జారీ చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ.యం.యస్.నెం.3, 4, 5 మరియు 20 లపై శిక్షణ మరియు అవగహన కార్యక్రమం నేడు మధ్యహ్నం 3 నుంచి 6 గంటల వరకు చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ ఫంక్షన్ హాలు నందు జరిగింది సదరు ఈ కార్యక్రమానికి శ్రీ పి.శ్రీహరిబాబు, మునిసిపల్ కమిషనర్, చిలకలూరిపేట పురపాలకసంఘము వారి అధ్యక్షతన శ్రీ పి. మధుకుమార్, రీజినల్ డిప్యూటి డైరెక్టర్ టౌన్ & కంట్రీ ప్లానింగ్, గుంటూరు వారు, శ్రీ జి. సుబ్బా రెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ వారు, శ్రీమతి. బి. సునీత, అసిస్టెంట్ డైరెక్టర్ వారు, శ్రీ జే.పూర్ణచంద్రారెడ్డి, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వారు, శ్రీమతి. కె సుజాత, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ వారు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, వార్డు ప్లానింగ్ మరియు రెగ్యులేషన్ సెక్రెటరీలు, పల్నాడు జిల్లాలోని ఇతర మునిసిపాలిటీలలో పని చేయుచున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, వార్డు ప్లానింగ్ మరియు రెగ్యులేషన్ సెక్రెటరీలు జిల్లాలోని లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ మరియు బిల్డర్స్ ఈ కార్యక్రమమునకు హాజరైయ్యారు.
ఇందులో భాగంగా శ్రీ పి. మధుకుమార్, రీజినల్ డిప్యూటి డైరెక్టర్ టౌన్ & కంట్రీ ప్లానింగ్, గుంటూరు వారు మాట్లాడుతూ ప్రభుత్వము వారు జారీ చేసిన జి.ఓ.యం.యస్.నెం.3, జి.ఓ.యం.యస్.నెం.4, జి.ఓ.యం.యస్.నెం.5 మరియు జి.ఓ.యం.యస్.నెం.20 నందు సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీం పై శిక్షణ, అవగాహన కార్యక్రములో తెలిపిన విధంగా వార్డు ప్లానింగ్ మరియు రెగ్యులేషన్ సెక్రెటరీలు మరియు లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ప్రజలకు అవగహన కలిపించే విధముగా చూడాలని నూతన ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు సిబ్బంది, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ పని చేయాలని తెలిపారు. సదరు శిక్షణ కార్యక్రమములో పాల్గొన్న అధికారులు, వార్డు ప్లానింగ్ మరియు రెగ్యులేషన్ సెక్రెటరీలు, జిల్లాలోని లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ మరియు బిల్డర్స్ కి ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలిపించారు.
