
డీజిల్ ,పెట్రోల్ ,గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా ఎద్దుల బండ్ల ర్యాలీకి……….. డిసిసి అధ్యక్షులు శివసేనారెడ్డి పిలుపు
వనపర్తి :
“డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్థిక భారం మోపుతోంది. నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో ఇంధన ధరల పెంపు ప్రజల జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తోందన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు , రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి ఆదేశాల మేరకు రేపు ఎద్దుల బండ్లతో ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి పాల్గొనున్నారు. ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. అలాగే వనపర్తి మండలం పరిధిలో ఉన్న మండల అధ్యక్షులు ఆయా గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఎద్దుల బండ్ల తీసుకుని వనపర్తి రామాలయం వద్దకు రావలసిందిగా కోరడమైనది.
ఉదయం 09:30 గంటలకురామాలయం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వరకు ర్యాలీ కొనసాగుతుందని
ఈ సమావేశానికి మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, స్థానిక కౌన్సిలర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలో, ఆయా గ్రామాల సర్పంచులు, ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీ సెల్ నాయకులు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
