కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని NKNR హాల్‌లో * శాసనసభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు

TEJA NEWS

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని NKNR హాల్‌లో *కూకట్‌పల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బి.ఎల్.ఏ (BLA)ల శిక్షణ కార్యక్రమానికి *బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంఎల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు *, *ఎమ్మెల్యే వివేకానంద ,*ఎమ్మెల్సీ నవీన్ రావు *,*మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి *, మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ ,మాజీ చైర్మన్ గజ్జెల నాగేష్ ,ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం మరియు ఓటరు జాబితా పరిరక్షణలో BLAల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. బి.ఎల్.ఏల ప్రధాన బాధ్యతల్లో భాగంగా ఓటరు జాబితాను పరిశీలించడం, కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టడం, తప్పులు మరియు డూప్లికేట్ పేర్లను గుర్తించడం, ఓటర్ల వివరాలను సరిచేయించేందుకు సహకరించడం, ఎన్నికల కమిషన్ నిర్వహించే ప్రత్యేక సర్వేలు మరియు రివిజన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను మరింత పెంచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు.

కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమమని తెలిపారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించి, ప్రతి అర్హుడైన ఓటరుకు న్యాయం జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, వివిధ విభాగాల కమిటీ మాజీ చైర్మన్లు, పలు డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, పలు విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు మరియు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top