
తరుగు పేరిట రైతులను దోచుకుంటున్న వైనం. స్పందించని పాలకులు,అధికారులు.
చివరి గింజ కొనేంతవరకు రైతుల పక్షాన పోరాడుతాము…………….. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి :
నియోజకవర్గం లోని.
పెబ్బేర్ మండలంలో గుమ్మడం,పాత సుగూరు,రంగాపురం,పెబ్బేరు గ్రామాలలో పర్యటించి తడిసిన,మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను ఓదార్చి అధైర్య పడొద్దు అండగా ఉంటానని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సకాలములో యూరియా లేక,కరెంట్ సరఫరా లేక,రైతు భరోసా లేకున్నా ఓర్చుకొని ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కొనుగోలు లేక పడిగాపులు కాస్తూ రైతులు విలవిలాడుతున్నారని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అష్టకష్టాలు పడి ధాన్యం తరలిస్తే క్వింటాలుకు 10కిలోల తరుగు తీస్తూ రైతులను జలగల లాగ పీడిస్తున్నారని మాజీ మంత్రి దుయ్యబట్టారు.
వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి వారంలోపల రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల పక్షాన పోరాడుతాము నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
ఆయన వెంట వనం.రాములు,కర్రీస్వామి,దిలీప్ రెడ్డి,పెద్దింటి.వెంకటేష్,జగన్నాథం నాయుడు,ఎం.రాజశేఖర్,కృష్ణా రెడ్డి,ఎద్దుల సాయి కుమార్,ఎల్లారెడ్డి,గోవిందు నాయుడు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
