Spread the love

వేసవికాలంలో మండుటెండల దృష్ట్యా చెరువులోని సాగునీటి వనరుల మేరకు పంటసాగు చేయండి

చెరువులో నీరు ఎండలకు తగ్గుముఖం పట్టే అవకాశం నేపథ్యంలో పరిమితoగా పంట సాగు చేయాలి

రైతులకు వ్యవసాయాధికారి గౌరీ సూచన

ప్రస్తుతం వరదయ్యపాలెం మండలంలో తెలుగుగంగతో పాటు వర్షాల కారణంగా చెరువుల్లో నీరు పుష్కలంగా నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో విడత వరిపంట సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో..
వ్యవసాయాధికారి గౌరీ రైతులకు పలు సూచనలు చేశారు

ప్రస్తుతం వేసవి కాలం ఆరంభమై మండుటెండలకు చెరువులో నీళ్ళు మున్ముందు ఆవిరై నీటినిల్వలు తగ్గుముఖం పట్టే పరిస్థితి నెలకొనడంతో… వరిపంటకు నీరు అధికస్తాయిలో అవసరం ఉన్నందున వరి సాగు చేయడం వల్ల పంట కోత దశకు చేరే సమయానికి చెరువులో నీరు అవసరాల మేరకు తగిన స్థాయిలో అందక వేలాది రూపాయలు వ్యయంతో వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఏవో తెలిపారు.

వర్షాకాలంలో వేసిన వరి సాగు తరహాలో విస్తృతంగా వరి సాగు చేపట్టకుండా.. చెరువు నీటి వనరులను బట్టి పరిమిత స్థాయిలో సాగు చేయాలని కోరారు.

అదేవిధంగా ఎండల్లో వడదెబ్బ సోకే ప్రమాదం ఉన్నందున రైతులు పొలాలకి ఉదయాన్నే వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి రావాలని తమవెంట అందుబాటులో నీరు మజ్జిగ ఉంచుకోవాలని ఏవో విన్నవించారు