
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో 2000 వేల కోట్ల రూపాయలతోటి చేపట్టబోయే ఫ్లై ఓవర్ లు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నిర్మాణ పనులు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు నిర్వహించనున్న సందర్భంగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలసి మియాపూర్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని 2000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయినటువంటి శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
