మృతుడి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన…………. *మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

TEJA NEWS

మృతుడి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన…………. *మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి :

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు ఐజయ్యనగర్ వార్డుకు చెందిన గొల్ల బాలస్వామి కుమారుడు ప్రకాష్ ఆదివారం ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న *మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం వారి నివాసానికి చేరుకొని మృతుడి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని , ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తోపాటు ఆయన వెంట కూతురు తేజస్విని మరియు నాయకులు వాకిటి.శ్రీధర్, నందిమల్ల అశోక్,సయ్యద్.జహంగీర్,బాగ్యరాజ్,అరుణ్ యాదవ్,ఇమ్రాన్,ముని కుమార్,అలీమ్ రఘు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, స్థానికులు తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top