
బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యం….
–పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం,
బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చట్టప్రకారం వాటిని వేగవంతంగా పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు.
సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఫిర్యాదులను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, అందిన ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ నిరంతరం కృషి చేస్తోందని సీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
