
బౌరంపేట రైతులకు కూడా దుండిగల్ తరహాలో ఇద్దరు మధ్యలో ఒక ఒప్పందం చేసి 166 సర్వే నంబర్ రైతులందరికీ న్యాయం చేయాలని బౌరంపేట రైతుల తరపున బౌరంపేట్ బిజెపి విజ్ఞప్తి
బౌరంపేట 166 సర్వే నంబర్ లోని లావణ్య పట్టా రైతులతో బిజెపి నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది
బౌరంపేటలో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ నిర్మాణాల వెనకవైపు గల రైతులు నాచారం మల్లేష్ యాదవ్ శ్రీశైలం యాదవ్ సుదర్శన్ యాదవులకు, బాల్ రెడ్డి కృష్ణారెడ్డి బాల్రెడ్డి సంబంధించిన లావణ్య పట్టా భూమి గతంలో డబుల్ బెడ్ రూమ్ ల కోసం సుమారు 8 ఎకరాలు భూమి తీసుకోవడం జరిగింది మిగతా పొలంలో యాదవ్ లు పశువుల పాకలు వేసుకొని పచ్చిమేత అలికి పాడి వ్యవసాయం చేస్తున్న రైతులను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు మొన్న ఇబ్బందుల గురి చేస్తే వారు ఎక్కడికి వెళ్లాలో ఏమి చేయాలో పాలుపోక ఆవేదనకు గురయ్యారు ఎంపి ని కలిసి పరిస్థితి వివరించడం జరిగింది. గత 70 సంవత్సరాలు నుండి అదే పొలం మూడు తరాలుగా దున్నుకొని జీవిస్తున్నాము 1971లో ఇందిరాగాంధీ హయాంలో పట్టా ఇవ్వడం, అప్పటినుండి సాగు చేస్తూ భూమి కి పనులు కూడా కట్టడం జరిగింది 2001లో టిడిపి ప్రభుత్వంలో హోం మంత్రి దేవేందర్ గౌడ్ జిల్లా చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ గారు పాస్ బుక్కులు మంజూరు చేసి పహాణి రికార్డులు ఎక్కించడం జరిగింది. ఆ యొక్క పహానిలు 2015 వరకు కొనసాగినాయి తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో ధరణి పథకం కెసిఆర్ అమలు చేసినంక దానిలో రికార్డు చేయకుండా ఆపడం జరిగింది. ధరణిలో నమోదు చేయాలని నాటి నుండి రైతులు కూడా చాలామంది రెవెన్యూ అధికారులను కోరడం కూడా జరిగింది కానీ . అదే సమయంలో ప్రభుత్వం రెగ్స్యుమ్ చేసుకుందని మాకు ఇంతవరకు తెల్వదు 2017లో డబల్ బెడ్ రూమ్ ల కోసం తీసుకుంటే తీసుకుంటే కొంత ఐన అయినా పశువుల కొట్టాలు వేసుకున్నది తీసేయాలని మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పరిహారం ఇవ్వకుండా ఇంత న్యాయంగా మా యొక్క జీవనాధారమైన పొలాన్ని ప్రభుత్వం తీసుకోవడం తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. గతంలో మా యొక్క పొలం రింగ్ రోడ్లో ఎకరా పట్టా పొలం పోతే పొజిషన్ డిస్ట్రిబ్యూట్ వల్ల మాకు ఇంతవరకు పరిహారం రాలేదు ఇప్పుడు ఉన్న లావణ్య పట్ట భూమి కూడా పోతే మా పరిస్థితి ఏంటి మా జీవనాదారం ఏంటి అని మనోవేదనకు చెందిన నాచారం కుటుంబ సభ్యులు
దీనిపైన ఎంపీ రాజేందర్ తో విన్నవించుకుంటే వారు వెంటనే కలెక్టర్ కి ఫోన్ చేయడం జరిగింది . ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఇబ్బంది పడుతున్నారని అది తీసుకోవడం తప్పని పరిస్థితి అయితే రైతులను ఒకచోట కూర్చోబెట్టి ల్యాండ్ పూలింగ్ చేసి పరిష్కారం చూడాలని అప్పటివరకు రైతుల జోలికి వెళ్లకoడని కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది
మొన్న దుండిగల్లో రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఎకరాకు 600 గజాలు ఇస్తామని రెవెన్యూ అధికారులు తెలియజేయడం రైతులు 1200 గజాల ఇవ్వాలని డిమాండ్ చేయడం ఇద్దరి మధ్యలో పెండింగ్ పెట్టడం జరిగింది బౌరంపేట రైతులకు కూడా ఇదే తరహాలో ఇద్దరు మధ్యలో ఒక ఒప్పందం చేసి 166 సర్వే నంబర్ రైతులందరికీ న్యాయం చేయాలని బౌరంపేట రైతుల తరపున బిజెపి విజ్ఞప్తి
కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు మేడ్చల్ జిల్లా బీజేపీ ఇన్చార్జి అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి , దుండిగల్ సర్కిల్ బిజెపి అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, దమ్మ ప్రభాకర్ రెడ్డి, 166 సర్వేనెంబర్ రైతులు నల్ల రామచంద్రారెడ్డి నాచారం మల్లేష్, యాదవ్,శ్రీశైలం యాదవ్ తలారి కృష్ణ కుమార్ ముదిరాజ్ తలారి బాలకృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు