చదువు లోనే కాదు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి……..తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి

TEJA NEWS

చదువు లోనే కాదు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి……..తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి

వనపర్తి
40వ ఒలంపిక్స్ డే సందర్భంగా తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ వాళ్లు టార్చ్ రన్ ను వనపర్తి జిల్లా కేంద్రం డాక్టర్ బాల కృష్ణయ్య స్టేడియం లో నిర్వహించారు. ఒలంపిక్స్ డే టార్చ్ రన్ కు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు.

చిన్నారెడ్డి మాట్లాడుతూ

రాష్ట్ర బడ్జెట్ లో క్రీడలకు పదుల సంఖ్యలోనే బడ్జెట్ కేటాయించేవారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒలంపిక్స్ కు ఆడే విధంగా క్రీడాకారులను తయారు చేయాలని ఉద్దేశంతో 576 కోట్ల బడ్జెట్ ను కేటాయించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

విద్యార్థులు చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని క్రీడల ద్వారాశారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసాన్ని అందిస్తాయి అని అన్నారు.

ఒలింపిక్స్ టార్చ్ ప్రపంచ శాంతి, ఐక్యత మరియు సోదరభావానికి ప్రతీక అని అన్నారు.

యువత క్రీడలలో గెలుపోవటములను సమానంగా స్వీకరించాలని,
గెలుపు మాత్రమే కాదు, క్రీడా స్ఫూర్తి ని కలిగి ఉండాలని అన్నారు.

ఒలంపిక్స్ ప్రపంచ దేశాల క్రీడాకారులను ఒకే వేదికపై కలుపుతూ నైపుణ్యం ఉన్న క్రీడాకారులే ఒలంపిక్స్ లో మెడల్స్ సాధిస్తారని అన్నారు.

క్రీడల ద్వారా క్రమశిక్షణ, సమయపాలన మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అని అన్నారు.

ప్రతి విద్యార్థి రోజువారీ జీవితంలో క్రీడలకు సమయం కేటాయించాలి అని అన్నారు.

ప్రజా ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది అని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలి అని సీఎం కప్ పెట్టి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

ఒలింపిక్స్ టార్చ్ రన్ యువతలో స్ఫూర్తిని నింపే కార్యక్రమం అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ వచ్చే ఒలంపిక్స్ వరకు దేశం తరఫున రాష్ట్ర క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించి మెడల్స్ తెచ్చి దేశ పేరును ప్రపంచానికి వినిపించేలా క్రీడాకారులు తయారు కావాలని అన్నారు.

భారతదేశం 2036 నా ఒలింపిక్స్ క్రీడలను నిర్వహిస్తుంది అని తెలిపారు.

టార్చ్ ను వెలిగించి రన్ ను ప్రారంభించారు.
ఈ టార్చ్ రన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిన్నారెడ్డి అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వనపర్తి జిల్లా క్రీడల అధికారి సుధీర్ రెడ్డి గారు, జిల్లా బాక్సింగ్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మం, బాబా, మన్యం యాదవ్, నాగార్జున, చరణ్, సురేష్, రామ్ జి నాయక్, నందిమల్ల రాము, వెంకటేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top