Spread the love

బాధితులకు ఎల్ వో సి చెక్ అందజేత

భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో ప్రైజర్ పేటకు చెందిన పాటిబండ్ల ప్రకాష్ కు మంజూరైన రూ 2 లక్షల 20 వేల విలువ గల ఎల్ వో సి చెక్కును బాధితుడి కుటుంబానికి అందించినట్టు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.
పాటిబండ్ల ప్రకాష్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్థానిక టిడిపి నాయకులు పల్లె పోగు ప్రసాద్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి ఎల్ వో సి చెక్కును జారీ చేయడంతో కార్యాలయ కార్యదర్శి చెక్కును అందజేశారు.
బాధిత కుటుంబ సభ్యులు సుజనా కు కృతజ్ఞతలు తెలిపారు.