
బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిసిన అయోధ్య నగర్ కాలనీ నూతన అధ్యక్షులు జోయెల్…
132 – అయోధ్య నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికల్లో గెలిచిన జోయెల్ (బాబీ) కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. కాలనీ అభివృద్ధిలో యువతరం ముందున్నప్పుడే కాలనీ అభివృద్ధి సాధ్యమని అన్నారు. నిరుపేదలు అధికంగా జీవించే అయోధ్య నగర్ కాలనీలో కాలనీ అభివృద్ధిలో నూతన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో అయోధ్య నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.