
అధైర్య పడవద్దు అండగా ఉంటా — కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజల స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు..
అనంతరం నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర NSUI కార్యదర్శి రాకేష్ ముదిరాజ్ ని శాలువాతో సత్కరించారు.
— ప్రజల నుండి వచ్చిన పలు ఆహ్వానాలు, వినతిపత్రాలు స్వీకరించి సానుకూలంగా స్పందించారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— నియోజకవర్గం ప్రజలు అధైర్య పడవద్దు అండగా ఉంటానన్నారు..
— ఎంతమంది కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజా శ్రేయస్సే మా సంకల్పం అన్నారు..
— ఇంటింటికి ఇందిరమ్మ పాలన అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నారు..
— నియోజవర్గంలో అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు,అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..