Spread the love

కెపిహెచ్బి కాలనీ ఫోర్త్ ఫేస్ వెంచర్ 2 కి సంబంధించి ఫైనల్ కాస్ట్, అధిక వడ్డీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు నివాసితులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ని, జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఫోర్త్ ఫేస్ వెంచర్ 2 లోని ఫ్లాట్స్ కు హౌసింగ్ బోర్డ్ అధికారులు ఫైనల్ కాస్ట్ విషయంలో అధికంగా రేటు నిర్ణయిస్తున్నారని వడ్డీ సైతం అధికంగా వేస్తూ తమను ఆందోళనకు గురి చేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని రమేష్, కి వారు విజ్ఞాపన పత్రం అందజేశారు. దీనిపై రమేష్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను మంత్రి దృష్టికి అవసరమైతే సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానని బాధితులకు హామీ ఇచ్చారు.దీంతో నివాసితులు హర్షం వ్యక్తం చేశారు.