
అమరావతి:
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శాసనసభ ప్రత్యేక హక్కుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో విశాఖ డెయిరీకి సంబంధించిన అంశంపై కమిటీ సమగ్రంగా చర్చించింది. విశాఖ డెయిరీ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, సంస్థ పురోగతికి సంబంధించిన పలు అంశాలపై సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు విశాఖ డెయిరీని మరింత బలోపేతం చేయడంతో పాటు పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
శాసనసభ ప్రత్యేక హక్కుల కమిటీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించి అవసరమైన సూచనలు చేశారు.
ప్రజా ప్రయోజనాల పరిరక్షణ, రైతులు మరియు పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని పల్లా శ్రీనివాసరావు కోరారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
