సింగరేణి అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
స్మశానవాటికలు, రహదారులు, శవదహన యంత్రం, ఎస్టీపీ పనులపై సమీక్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:గోదావరిఖని, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పరిశీలించారు. పనుల నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు.
ముందుగా ఫోర్క్లెయిన్ ప్రాంతంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవుల స్మశానవాటికల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా పనులు చేపట్టాలని సూచించారు. పనుల్లో నాణ్యతకు ఎలాంటి రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎల్బీ నగర్, జవహర్ నగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
తదుపరి గోదావరి తీరంలోని ఆధునిక శవదహన యంత్రాన్ని పరిశీలించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అన్ని సౌకర్యాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం) నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఆర్జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, సింగరేణి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
స్మశానవాటికలు, రహదారులు, శవదహన యంత్రం, ఎస్టీపీ పనులపై సమీక్ష…
సాక్షిత న్యూస్ పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:గోదావరిఖని, జూలై-11. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ శనివారం పరిశీలించారు. పనుల నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు.