మేడిపల్లిలో హిందూ స్మశాన వాటిక, కబ్రస్థాన్‌లో ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం…

TEJA NEWS

మేడిపల్లిలో హిందూ స్మశాన వాటిక, కబ్రస్థాన్‌లో ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం…

పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని నాయకుల పిలుపు…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:గోదావరిఖని, రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో మేడిపల్లి ప్రాంతంలోని హిందూ స్మశాన వాటిక, కబ్రస్థాన్ పరిసరాల్లో ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు.

ఎన్‌టీపీసీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా సూచనలతో, 33వ. డివిజన్ కార్పొరేటర్ మెరుగు భూలక్ష్మి లింగమూర్తి అధ్యక్షతన మున్సిపల్ సిబ్బంది చెట్ల పొదలను తొలగించి, వ్యర్థాలను తొలగిస్తూ విస్తృత పారిశుధ్య పనులు చేపట్టారు. స్మశాన వాటిక, కబ్రస్థాన్ పరిసరాలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ఇలాంటి స్వచ్ఛత కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి సూచనల మేరకు “స్వచ్ఛ రామగుండం” లక్ష్యంతో అన్ని డివిజన్లలో పారిశుధ్య కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని 33వ డివిజన్ కార్పొరేటర్ మెరుగు భూలక్ష్మి స్వయంగా పర్యవేక్షించి నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top