
దివ్యాంగులకు అండగా వీపీఆర్ ఫౌండేషన్
నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 1,040 ట్రైసైకిళ్ల పంపిణీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు మరో ఇద్దరు దివ్యాంగులకు ఉచితంగా ట్రైసైకిళ్లను అందజేశారు. మధుమేహం (డయాబెటిస్) కారణంగా కాళ్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు బాధితుల పరిస్థితిని తెలుసుకున్న వేమిరెడ్డి దంపతులు, వారి కదలికలకు ఆసరాగా ట్రైసైకిళ్లను పంపిణీ చేసి మరోసారి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.
ట్రైసైకిళ్లు అందుకున్న వారిలో కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం, రామాయపట్నం (రెడ్డిపాళెం) గ్రామానికి చెందిన పంతంగి శ్రీనివాసులు, అలాగే ఉదయగిరి నియోజకవర్గం, ఉదయగిరి టౌన్‌లోని మాదిగపాలెంకు చెందిన నగిల్లా రామయ్య ఉన్నారు. ట్రైసైకిళ్లు అందుకున్న లబ్ధిదారులు తమకు అండగా నిలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు ట్రైసైకిళ్లతో కలిపి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,040 మంది దివ్యాంగులకు ఉచిత ట్రైసైకిళ్లను అందజేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.
మరో ఇద్దరికి ఉచిత ట్రైసైకిళ్లు అందజేసిన వేమిరెడ్డి దంపతులు