రైతన్న నమ్మకాన్ని నిలబెట్టిన కూటమి ప్రభుత్వం

TEJA NEWS

రైతన్న నమ్మకాన్ని నిలబెట్టిన కూటమి ప్రభుత్వం

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

రైతు భూమికి సంపూర్ణ భద్రత కల్పించడమే మన ప్రభుత్వ లక్ష్యమని రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను శుక్రవారం రైతులకు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. అనంతరం ఆమె మాట్లాడుతూ. కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం గ్రామంలో మూడు తరాలుగా పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, “322 మంది రైతులకు” రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందించామని రైతు భూమికి సంపూర్ణ రక్షణ కల్పించి, వారి హక్కులను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే మన ప్రభుత్వం “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమాన్ని అమలు చేస్తోందిఅనిగతంలో 1-B, అడంగల్ వంటి కీలక భూ రికార్డులు అందుబాటులో లేక రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది.

ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పారదర్శకంగా రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చాం.రైతుల హక్కుల పరిరక్షణ, భూ రికార్డుల ఆధునికీకరణ, పారదర్శక పాలన కోసం మా ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తోందిఅనివారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. అలాగే ఈనెల 22న తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో నగదు జమవుతుందని స్పష్టత ఇచ్చారు. రూ.770 కోట్లతో కోవూరు అభివృద్ధి గత ప్రభుత్వంలో అస్త వ్యవస్థ చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతూ అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా ముందుకు పోతున్నామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మార్వో సుబ్బయ్య, కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డి, పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, జెట్టి మదన్ రెడ్డి, ఎంపీపీ తుమ్మల పార్వతి, తిరుమూరు శ్రీవాణి, ఎంపీటీసీ నాగరాజు, బెల్లంకొండ విజయ్, బత్తల రమేష్, వేగూరు సుబ్బయ్య నాయుడు, బాల రవి, గాదిరాజు అశోక్, నాటకరాణివెంకట్, బిజెపి మా నాయకుడు పోలిశెట్టి సుబ్బారావు, జనసేన నాయకుడు చెప్పిన శ్రీనివాస్ రెడ్డి, మరియు రైతులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top