విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

TEJA NEWS

విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

కోవూరు నియోజవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ శుక్రవారం కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించి అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు లేకుండా, నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు గ్రామంలోనే అందాలనే లక్ష్యంతో ఈ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం.ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం.

గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు మా కృషి నిరంతరం కొనసాగుతుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, జెట్టి మదన్ రెడ్డి, ఎంపీపీ తుమ్మల పార్వతి, ఎంపీటీసీ నాగరాజు, బెల్లంకొండ విజయ్, బత్తల రమేష్, వేగురు సుబ్బయ్య నాయుడు, బాల రవి, నాటక రాణి వెంకట్, బిజెపి నాయకుడు పోలిశెట్టి సుబ్బారావు జనసేన నాయకుడు చప్పిడి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top