
కూకట్పల్లి నియోజకవర్గం అల్లపూర్ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ బస్తీ వాసులు ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారిని వార్డు కార్యాలయంలో కలిసి రాధాకృష్ణ నగర్, గణేష్ నగర్ బస్తీలలో మంచినీటి సరఫరా కొరత ఉందని ఎన్నో రోజుల నుండి అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోనటువంటి పరిస్థితి నెలకొందని స్థానికులు కార్పొరేటర్ గారికి తెలియజేశారు తక్షణమే కార్పొరేటర్ గారు స్పందించి సంబంధిత జలమండలి మేనేజర్ విలియం ప్రకాష్ గారికి ఫోన్ కాల్ చేసి తక్షణమే రాధాకృష్ణ నగర్ గణేష్ నగర్ మరియు నువ్వు రామారావు నగర్ రామారావు నగర్ పలు బస్తీలలో నెలకొన్నటువంటి నీటి కొరతను తక్షణమే పరిష్కారం చూపాలని నీటి సమస్య తలెత్తకుండా చూడాలని వారికి ఫోన్ కాల్ ద్వారా తెలియజేయడం జరిగింది. అనంతరం స్థానికులకు రేపు మంచినీటి సరఫరా సమయానికి ఏ విధంగా మంచినీరు వస్తున్నాయో చూసి మళ్లీ తన దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ గారు వారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ అధ్యక్షులు పన్నాల రాజశేఖర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, సుందరం శేషారావు, జలెందర్, దామొదర్, తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.
