
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి చిన్నపాటి గాయం రెండు రోజులు రెస్ట్….
గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి తలకి చిన్న పార్టీ ఖాయం అయ్యింది ఆయన గత గురువారం సాయంత్రం నరసరావుపేట లోని ఆయన స్వగృహంలో క్రాఫ్ చేయించుకుని స్నానానికి వెళ్లే క్రమంలో జారిపడి తలకు చిన్నపాటి గాయం అయింది స్థానిక మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో గాయానికి ఎనిమిది కుట్లు వేసినట్లు తెలిసింది. కావున డాక్టర్ల సూచన మేరకు ఆయన రెండు రోజులు పాటు ప్రజలకు వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందుబాటులో ఉండరు. అయితే ఎటువంటి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు తెలిపారు.
