చింతల్ సంజీవయ్య నగర్‌లో శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి 9వ వార్షికోత్సవ వేడుకల్లో మాజీ కూన శ్రీశైలం గౌడ్‌

TEJA NEWS

చింతల్ సంజీవయ్య నగర్‌లో శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్‌

చింతల్‌లోని సంజీవయ్య నగర్‌లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయం 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ కమిటీ సభ్యుడు విజయ్ గుప్తా గారు, గడ్డం రాజేందర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షురాలు స్వాతి రాజేందర్ రెడ్డి, యాదగిరి, పెంటయ్య ముదిరాజ్, సూరా రవీందర్ గౌడ్, విజయేందర్ గుప్తా, ఉమామహేశ్వర్, కృష్ణమ నాయుడు, ఉమేష్, జానయ్య కృష్ణ కుమార్, సిహెచ్ శ్రీనివాస్ గుప్త, కిరణ్ యాదవ్, నాంపల్లి విజయ్, రాజు గుప్తా, రాజమౌళి, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top