
మెట్టుగుట్ట ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే గారి కృషి…
ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే KR నాగరాజు …
ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగానే కాకుండా అన్నివిధాల కృషి చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. మెట్టుగుట్ట ఆలయ చైర్మెన్ రఘుచందర్ ఆలయ ఈఓ,అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఈ నెల 9,10వ తేదీలలో నిర్వహించే సీతారామచంద్రస్వామి పవిత్రోత్సవములకు ఆహ్వానించారు. ఎమ్మెల్యే కృషితో పది సంవత్సరాలుగా ఆలయంలో అర్చక సేవలు అందిస్తున్న పరశురాం విష్ణువర్ధన్ చార్యులు కి పర్మినెంట్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, దేవదాయశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి ఆలయ అభివృద్ధికి కోసం కలిసిన నేపధ్యంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో 6కోట్ల 98 లక్షల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.మెట్టుగుట్ట దేవస్థానం అభివృద్ధికి తనవంతు సంపూర్ణ సహకారం ఉంటుదని తెలిపారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీప దూప నైవేద్య పథకం కింద ఆలయాలకు ఆర్థిక చేయూతను అందిస్తుందన్నారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి దేవాలయం అభివృద్ధికి నోచుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి చొరవతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.విష్ణువర్ధన్ చార్యులు పురోహితుడు శాశ్వత ఉద్యోగం కోసం అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి కొండా సురేఖ కి కలిసిన సందర్బంగా వారికి పర్మినెంట్ ఉద్యోగం రావడం సంతోషమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి,మంత్రి కొండా సురేఖ కి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఈఓ సత్యనారాయణ,అర్చకులు అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.