
మహిళ సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట…
మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే KR నాగరాజు …
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర కళ్యాణ మండలంలో 65,66వ డివిజన్లకు చెందిన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని.గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో మహిళల జీవిత స్థాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు.రాష్ట్రంలో మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.అర్హులైన పేద మహిళలకు, మహిళా సంఘాల సభ్యులకు ఈ చీరలను అందజేస్తామన్నారు.అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా, ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. కుటుంబ అభ్యున్నతిలో మహిళలే కీలకమని,భవిష్యత్ తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని హితువు పలికారు.రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు తదితర వాటిని ప్రభుత్వం మహిళల పేరుతోనే మంజూరు చేస్తోందని, మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని అన్నారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 66వ డివిజన్ అధ్యక్షులు కిరణ్ ,65వ డివిజన్ అధ్యక్షులు సునీల్,ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి,మండల అధ్యక్షులు అశోక్ కుమార్,మహిళ అధ్యక్షురాలు జోరిక పూల,మహిళ ఉప అధ్యక్షురాలు స్వాతి,మాజీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి,వంగపహడ్ PACS చైర్మెన్ మెరుగు రాజేష్ గౌడ్,మండల,డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.