Spread the love

రైతు భరోసాపై సీఎం స్పష్టత

TG: రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా అందిస్తాం అని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అలాగే భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామన్నారు. అప్పుల కారణంగానే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే మొదటి ఏడాదిలోనే రూ. 20 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.