Spread the love

ఆదివాసి హక్కుల పోరాట సమితి

జాతీయ ST కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ నీ కలిసిన ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడెం దెబ్బ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ నీ. కలిసిన తుడుం దెబ్బ నాయకులు…పలు సమస్యలపై వివరణ ఇవ్వడం జరిగినది,వారు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆదివాసి భూములు….. కనుమరుగైపోతున్నాయని, కొంత మంది ఇతర కులస్తులు అధికారులతో కుమ్మక్కై, దొంగ పాస్ పుస్తకాలు తయారుచేసి ఆదివాసీ భూముల ను. లాక్కుంటున్నారని,ఏజెన్సీ ప్రాంతంలో సర్వ హక్కులు ఆదివాసులకే, ఉండాలని ఆదివాసి చట్టాలను సరి చేయాలని. అన్యకాంతమైన, ప్రభుత్వ భూములను వెలుగులోకి తీసి,ఆ భూములను భూమి లేని నిరు పేదలకు పంచాలని,ప్రతి మండలానికి ఒక ఆదివాసి కమ్యూనిటీ హాల్ కేటాయించాలని,ఆదివాసి చట్టాలు.. హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబల్ల రవి. రాష్ట్ర నాయకులు బండారు సూర్యనారాయణ, అశ్వారావుపేట మండలం తుడుం దెబ్బ నాయకులు కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.