TEJA NEWS

వేములవాడ:మార్చి 09
దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు సుమారు మూడు కోట్లు ఖర్చు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు.

కానీ ఆలయంలోని ఇంజ నీరింగ్ శాఖ అధికారులు మాత్రం నామమాత్రపు ఏర్పాట్లు చేస్తున్నారు. సూచిక బోర్డు‌లు తప్పుగా ఏర్పాటు చేయడం, కోడె టికెట్ రెండు వందల రూపాయలు ఉండగా..

గతంలో సూచిక బోర్డు మీద ఉన్న టికెట్ ధర 100రూపా యలు ఉండగా అట్టి బోర్డు కూడా సరిచేయకుండా వదిలి వేయడం తో భక్తులు ఇబ్బందులకు గురవుతు న్నారు.

ఆలయంలో ఈఈ స్థాయి అధికారి విధులు నిర్వహి స్తుండగా ఆ శాఖలో కింది స్థాయి అధికారులు చేసే తప్పిదాలు వారి నిర్లక్షానికి అద్దం పడుతున్నాయి.

అధికారులు వెంటనే చొరవ చూపి సూచిక బోర్డులను మార్చాలని భక్తులు కోరుతున్నారు.


TEJA NEWS