
శివ శివ అనగానే శాంతి కలుగుతుంది, శంభో స్మరణతో బాధలు తొలగుతాయి – ఎమ్మేల్యే కె.పి.వివేకానంద్.
రాజీవ్ గాంధీ నగర్ నల్లగుట్ట పైన వెలచివున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం 24వ ద్వాదశ జ్యోతిర్లింగాల శివ పూజ మహోత్సవం పోస్టర్ను ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ఆవిష్కరించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ఏడు లాగానే ఈ ఏడాది కూడా శివ పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు ఈ ఈ మహోత్సవానికి హాజరై స్వామివారిని దర్శించుకుంటారని వారు తెలిపారు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు దుదిమెట్ల సోమేష్ యాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు సంజీవరెడ్డి,పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్,డివిజన్ అధ్యక్షులు విజయరామరెడ్డి, రుద్రా అశోక్, పుప్పాల భాస్కర్, పోలె శ్రీకాంత్,నాయకులు ముకుందం,పిట్ల మల్లేష్,ఇమ్రాన్ బేగ్, నారాయణ, బద్రి,నాగభూషణం,అసిఫ్,జునైద్ మరియు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ నాయకులు-సభ్యులు, శివ స్వాములు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు
